గ్రామ, వార్డు సచివాలయంలో ప్రచురించిన డేటాలో పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం ఇతర వివరాలు పొందుపరిచారు. ఈ డేటాపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), పంచాయతీ కార్యదర్శి (పీఎస్) క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)కి నివేదిస్తారు. వీటిని ఆర్ఐ పునఃపరిశీలించి తహశీల్దార్ (ఎంఆర్వో)కు పంపిస్తారు. ఆ తరువాత తహశీల్దార్ వీఆర్వో, ఆర్ఐల నివేదికలో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలిపి ఆ వివరాలను పోర్టల్లో పొందుపరుస్తారు.
Home Andhra Pradesh డిసెంబర్ నెలాఖరు వరకు ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలు స్వీకరణ, తుది జాబితా ఎప్పుడంటే?-ap schedule...