ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు దృష్టిసారించారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలవరం పూర్తిచేయడంతో పాటు బనకచర్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ నీటిపారుదలకు కీలకం అన్నారు. కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలకు గోదావరి నీరు చేరుతుందన్నారు. బనకచర్లకు నీటిని తీసుకెళ్లేందుకు నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు ఆపిందెవరో వైఎస్ జగన్‌ చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో నిలిచిపోయిన 74 కేంద్ర పథకాలు మళ్లీ అమలు చేశామన్నారు. ఏ రాష్ట్రానికి లేని అప్పు ఏపీకి ఉందంటే అందుకు జగనే కారణమని విమర్శించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు పడ్డాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here