వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ ఈవెంట్ తెలంగాణలోని నిజామాబాద్ లో ఘనంగా జరిగింది. వెంకటేష్ స్టెప్పులు, హీరోయిన్లు మాటలతో ప్రేక్షకులు సంతోషించారు. ఈ సందర్భంగా ఈవెంట్ లో మాట్లాడిన మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను జీవితంలో హీరోగా యాక్ట్ చేయనని, నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెబుతున్నాట్లు ప్రమాణం చేశారు. దీంతో ఆ మాటలు వైరల్ అయ్యాయి.