ఎప్పుడూ ప్రజల పక్షమే..
‘అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే. కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి.. విచారణకి వెళ్తాం. మాకు అధికారులపైన, కోర్టుల పైన విశ్వాసం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డిపైన లేదు. కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని’ అని హరీష్ రావు వివరించారు.