కొంత మంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువు తీస్తున్నారని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు. గరికపాటిపై వస్తున్న ఆరోపణలను నిరాధారం, సత్యదూరమని ఆయన టీమ్ పేర్కొంది. ఆయన ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటూ ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం జరుగుతోందని వీటిని గరికపాటి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. గరికపాటిపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తామని గరికపాటి టీమ్ హెచ్చరించింది.
Home Andhra Pradesh గరికపాటి నరసింహారావుపై సంచలన ఆరోపణలు, తప్పుడు ప్రచారంపై గరికపాటి టీమ్ సీరియస్-garikapati narasimha rao issue...