గత బకాయిలు, ధరల పెరుగుదలతో…తమ కంపెనీ వస్తున్న నష్టాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణ నుంచి రావాల్సిన గత రెండు త్రైమాసిక బకాయిలు రూ. 900 కోట్లు అని యూబీఎల్ పేర్కొంది. పండుగ సీజన్, మరో త్రైమాసిక అమ్మకాలతో తెలంగాణ నుంచి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.