PM Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ శంకుస్థాపన చేశారు. విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ప్రజావేదిక బహిరంగ సభలో… విశాఖ రైల్వేజోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకు ప్రధాని ఇవాళ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 17 రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ జాతికి అంకితం చేశారు.
Home Andhra Pradesh ఏపీలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం, చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని...