జింతేంద్ర ఈవీ యునిక్ ఫీచర్లు
జింతేంద్ర ఈవీ యునిక్ లో డ్యూయల్ డిస్క్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్ తో కూడిన 12 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు, రైడర్ భద్రత కోసం సైడ్ స్టాండ్ సెన్సార్లు ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, అధునాతన డిస్ప్లేతో స్మార్ట్ డిజిటల్ ఎల్ఈడీ క్లస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter) లో క్రోమ్ఆర్క్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రేడియంట్ హెక్స్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఈగిల్ విజన్ ఎల్ఈడీ బ్లింకర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ యూనిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్లూటూత్-కనెక్టెడ్ బ్యాటరీ కూడా లభిస్తుంది. ఇది మెరుగైన రైడింగ్ అనుభవం కోసం స్మార్ట్ కనెక్టివిటీ, సహజ నియంత్రణలను అందించే జెఇఎన్ అప్లికేషన్ ను ఇంటిగ్రేట్ చేస్తుంది. యాక్సెసరీల పరంగా, వినియోగదారులు కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న స్మార్ట్ టెక్నాలజీ హెల్మెట్, వెనుక ప్యాసింజర్ హెల్మెట్ హోల్డర్ అయిన యునిక్రోన్ ను ఎంచుకోవచ్చు. అదనంగా ఇందులో యునికేస్ డిటాచబుల్ బ్యాగ్, పంక్చర్ సమయంలో వాహనాన్ని ముందుకు నడిపించడానికి యునికార్ట్ బూస్టర్ ఉంటాయి.