స్టార్ హీరోయిన్ శ్రీలీల(sreeleela)రీసెంట్ గా ‘పుష్ప 2(Pushpa 2)’లోని కిస్సిక్ సాంగ్ తో ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన విషయం తెలిసిందే.నిజానికి ఈ సాంగ్ కి ముందు శ్రీలీల వరుస ప్లాప్ లని ఎదుర్కొంది కానీ కిస్సిక్ సాంగ్ ఆ ప్లాపులని మర్చిపోయేలా చేసి శ్రీలీల కెరీర్ కి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కొంత కాలం నుంచి ఒక రేంజ్ లోనే సర్క్యులేట్ అవుతు వచ్చాయి.

వరుణ్ ధావన్,కార్తీక్ ఆర్యన్,వంటి బడా హీరోల పేరులే వినిపించాయి. కానీ ఇప్పుడు ఒకే ఒక్క పిక్ తో ఆ హీరో ఎవరో తెలిసిపోయింది.బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ నటవారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అనుకోవచ్చు.ఈ ఇద్దరు కలిసి  ముంబై లోని మాడాక్ ఫిలిం ఆఫీస్ కి వెళ్లారు.ఆ తర్వాత ఇద్దరు బయటకి వచ్చి ఫొటోలకి పోజులు కూడా ఇచ్చారు.దీంతో ఇన్ని రోజులు శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా? లేక  ఆ వార్తలు ఒట్టి  రూమర్సేనా అని భావించే వాళ్లకి, ఇప్పుడు  ఆ పిక్ శ్రీలీల బాలీవుడ్  ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్టే అని భావించవచ్చు.ఇప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో దిగిన ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది.శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ పై ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు నితిన్(Nithiin)తో రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తుంది.వీటిల్లో రాబిన్ హుడ్  షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే.ఉస్తాద్ షూటింగ్ స్టార్ట్ కి ఇంకొంచం టైం పట్టేలా ఉంది.ఈ లోపు ఆమె ఇబ్రహీం సినిమాని కంప్లీట్ చేసే అవకాశం ఉండవచ్చు.ఏది ఏమైనా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ న్యూస్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.మరి శ్రీలీల కూడా ఏ మేర తన సత్తా చాటుతుందో చూడాలి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here