మోహనబాబుకు ఒక కుమారుడు ఉన్నాడని, ఆయనతో వివాదం ఉందని, 20-30 మందితో కుమారుడు తన ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు. క్షణికావేశంలో మోహనబాబు జర్నలిస్ట్ మైక్ లాక్కొని, అదే మైక్‌ను విసిరారన్నారు. అయితే ఈ ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే బాధితుడైన జర్నలిస్ట్‌కు నష్టపరిహారం కూడా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని అభ్యర్థించారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును పరామర్శించేందుకు కూడా మోహనబాబు వెళ్లారని రోహత్గీ కోర్టుకు తెలిపారు.