స్వార్ధ రాజకీయాల కోసమే బీజేపీతో జగన్ జత కట్టారని ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆంధ్రలో ఒక్క కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు. అంబేడ్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన షర్మిల.. ఆయన్న మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.