కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంకేతం
మూత్రం నుండి అసాధారణ వాసన రావడం అనేది కిడ్నీ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. శరీరంలో విష పదార్థాల పరిమాణం పెరుగుతుండటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. దీనిని నిర్లక్ష్యపెడితే కొంతకాలం తర్వాత, ఈ పెరుగుతున్న విష పదార్థాలు కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావితం చూపిస్తాయి. కిడ్నీ సమస్య అప్పటికే మొదలై ఉంటే, మీ మూత్రం వాసన వస్తుండటంతో పాటు చర్మం పసుపు రంగులోకి మారడం, వేగంగా బరువు తగ్గడం, దురద, వాపు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అటువంటి సమయంలో, మీరు ఒకసారి వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి.