నటసింహ నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఘనవిజయాలు, బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నారు. అంతేకాకుండా సంక్రాంతి హీరోగా బాలయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఇచ్చారు ప్రేక్షకులు. సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలు బాలయ్య కెరీర్‌లో ఉన్నాయి. వాటి సరసన చేరబోతోంది ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడం విశేషం. వివిధ ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఈ సినిమాపై ఎలాంటి ఒపీనియన్‌ చెప్పారో చూద్దాం.

‘సంక్రాంతి అంటే బాలయ్యదే.. సినిమాలోని ప్రతి సీన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ప్రతి డైలాగ్‌కి విజిల్స్‌ వేస్తున్నారు. బాలయ్య ఎనర్జీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు’

‘సంక్రాంతికి విడుదలైన పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. కథ పాతదే అయినా దాన్ని కొత్తగా చూపించడంలో బాబీ సక్సెస్‌ అయ్యారు. బాలయ్యలోని ఎనర్జీని స్క్రీన్‌పై హండ్రెడ్‌ పర్సెంట్‌ చూపించారు. ఈ సంక్రాంతి హిట్‌ అంటే డాకు మహారాజ్‌ అనే చెప్పాలి’

‘డాకు మహారాజ్‌ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా చూసి ఆడియన్స్‌, అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. ఈమధ్యకాలంలో ఇలాంటి పవర్‌ఫుల్‌ మూవీ రాలేదని అంటున్నారు. ఏ విధంగా చూసినా బాలకృష్ణకు మరో బ్లాక్‌బస్టర్‌ మూవీ డాకు మహారాజ్‌’

‘సినిమా ఇంత ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని నేను అనుకోలేదు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా సినిమాకి వెళ్లాను. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు చాలా ఎంజాయ్‌ చేశాను. బాలయ్య అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌, బాబీ డైరెక్షన్‌, థమన్‌ మ్యూజిక్‌, బాబీ డియోల్‌ నటన అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి’

‘అక్కడక్కడ కాస్త స్లో అనిపించినా ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్‌ అవ్వదగ్గ సినిమా ఇది. స్టోరీ, డైరెక్షన్‌, పెర్‌ఫార్మెన్స్‌, మ్యూజిక్‌.. ఇలా అన్ని క్రాఫ్ట్స్‌ వర్క్‌ బాగా కుదిరింది. బాలయ్యకు ఇది మరో సంక్రాంతి హిట్‌’

‘రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి బాలయ్య ఎప్పుడూ ఆలోచించరు. సినిమాని బ్లాక్‌బస్టర్‌ చెయ్యడమే ఆయనకు తెలుసు. సినిమా ఎంత కలెక్ట్‌ చేస్తుంది అని కాకుండా ఎంత పెద్ద హిట్‌ అయ్యింది అనేది ముఖ్యం. డెఫినెట్‌గా ఇది బ్లాక్‌బస్టర్‌ మూవీ’


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here