ఇందిరమ్మ ఇళ్ల వెబ్ సైట్ – ముఖ్యమైన అంశాలు:
- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. దరఖాస్తుదారుడికి ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసుకునే వీలు ఉంటుంది.
- ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ http://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
- హోం పేజీలో Grievance Entry ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఫిర్యాదు ప్రక్రియపై ముందుకెళ్లవచ్చు.
- ఫిర్యాదు లేదా సమస్య వివరాల తర్వాత.. Grievance Id జనరేట్ అవుతోంది.
- ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
- గ్రామాల్లో ఎంపీడీవో ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేరుతుంది.
- ఇక పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేరుతుంది.
- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కు సంబంధించి ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. 040-29390057 నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందవచ్చు.
ఇక గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.