Kaushik Reddy Vs Sanjay Kumar : కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన మంత్రుల సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టేజ్ పై ఒకరినొకరు తోసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకుని దుర్భాషలాడారు. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవు అని సంజయ్ కుమార్ ను నిలదీశారు. నేను కాంగ్రెస్ అంటూ సంజయ్ సమాధానం ఇచ్చారు. కౌశిక్ రెడ్డి మీదకు దూసుకురావడంతో ఇద్దరు తోపులాటకు దిగారు. స్టేజ్ పై ఉన్న నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here