స్టైలిష్ యాక్షన్
డాకు మహారాజ్ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సుల్లో బాలకృష్ణ దుమ్మురేపేశారని, స్టైలిష్‌గా ఉందంటూ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలోని విజువల్స్ గురించి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ రిచ్‌గా కనిపిస్తోందంటూ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‌పాండే, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రలు చేశారు.