‘డాకు మహారాజ్’ విడుదలైన మొదటి రోజు నుంచే తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండడమే ఈ ఘనవిజయానికి కారణం అంటున్నారు అభిమానులు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణతో ఈ సంక్రాంతి బాలయ్యదే అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాబి కోల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘డాకు మహారాజ్’తో బాలకృష్ణ నట విశ్వరూపం మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా విదేశాల్లోనూ తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేస్తోంది. ముఖ్యంగా యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఈ సినిమాకి యు.ఎస్.లో చేసిన ప్రమోషన్స్ కలెక్షన్లు భారీగా రావడానికి ఉపయోగపడ్డాయి. ప్రీమియర్స్ బుకింగ్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇటీవలికాలంలో బాలయ్యకు యు.ఎస్.లో మంచి మార్కెట్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు డాకు మహారాజ్ దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే 1 మిలియన్ గ్రాస్‌ను క్రాస్ చేసింది. సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పిస్తున్నాయి. యు.ఎస్.లో బాక్సాఫీస్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్ మారిందని తెలుస్తోంది. కలెక్షన్లపరంగా డాకు మహారాజ్ యు.ఎస్. నంబర్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మాస్, యూత్ ఆడియన్సే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి తరలి వస్తుండడంతో కలెక్షన్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
డాకు మహారాజ్ కథ, కథనం, డైరెక్టర్ బాబీ టేకింగ్, డిఫరెంట్ లొకేషన్స్ ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేస్తున్నాయి. దానికితోడు థమన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న టాక్ చూస్తుంటే ఈ సంక్రాంతి విన్నర్ బాలకృష్ణే అనిపిస్తోంది. మరి మిగతా సినిమాల ధాటిని కూడా తట్టుకొని బాలయ్య నిలబడగలడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనే విషయంలో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో సాధించిన కలెక్షన్స్ చూస్తుంటే బాలకృష్ణ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.