టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025’లో తెలుగు సంతతి ఆటగాడు నిశేష్ బసవరెడ్డి మంచి ప్రదర్శనే చేశాడు. టెన్నిస్ దిగ్గజం, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత నొవాక్ జొకోవిచ్‌కు పోటీ ఇచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా తరఫున బసవరెడ్డి బరిలోకి దిగాడు. మెల్బోర్న్ వేదికగా నేడు (జనవరి 13) జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-3, 6-4, 6-2 తేడాతో 107వ ర్యాంక్ బసవరెడ్డిపై విజయం సాధించాడు. జొకోవిచ్పై తొలి సెట్‌ను దక్కించుకొని వావ్ అనిపించాడు 19ఏళ్ల నిశేష్. అయితే, ఆ తర్వాత జొకోవిచ్ వరుసగా మూడు సెట్లు దక్కించుకొని మ్యాచ్ గెలిచాడు.