హీరో మంచు విష్ణు పెద్ద మనసు చాటుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు అందరూ మెచ్చుకునే పని చేశారు. తిరుపతిలోని బైరాగిపట్టెడలో ఉన్న ఓ అనాథాశ్రమంలోని చిన్నారులను మంచు విష్ణు దత్తత తీసుకున్నారు. మాతృశ్య అనే అనాథాశ్రమంలోని 120 మంది చిన్నారులను విష్ణు దత్తత తీసుకున్నారు. ఇకపై వారికి అన్నగా అండలా ఉంటానని చెప్పారు. విద్యా, వైద్యం అన్నీ చూసుకుంటానని మాటిచ్చారు. వీలైతే మీరు కూడా అనాథలకు సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు.