ఆ తప్పు మళ్లీ జరగకూడదు
విదేశీ పర్యటన ఉన్నప్పుడు భారత ఆటగాళ్లనంతా ఒకేసారి పంపాలని, బ్యాచ్‌లుగా పంపే తప్పును మరోసారి చేయకూడదని బీసీసీఐకి సునీల్ గవాస్కర్ సూచించారు. “ఆస్ట్రేలియాలో తప్పు జరిగింది. ఇక అది రిపీట్ కాకూడదు. ఇంగ్లండ్‌కు జట్టు ఒకే గ్రూప్‌గా వెళ్లాలి. ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు నాలుగు బ్యాచ్‌లుగా వెళ్లకూడదు. ఆస్ట్రేలియాలో తొలి రెండు రోజులు.. కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ లేకుండా జట్టు ఉంది. ఇలా చేసి హోమ్ టీమ్‌కు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. లీడర్షిప్ గ్రూప్ లేకుండా వెళితే.. కొన్ని సవాళ్లు ఎదురైనా ఇబ్బందులు పెరుగుతాయి. ఇంకోసారి ఇలా కాకుండా బీసీసీఐ చూసుకోవాలి. గాయమైతే ఎవరైనా ఆటగాళ్లు ఆలస్యంగా జాయిన్ కావొచ్చు. కానీ జట్టు పోరాటానికి సిద్ధంగా ఉందనే స్టేట్మెంట్ను ఇచ్చేలా లీడర్స్ వ్యవహరించాలి” అని గవాస్కర్ చెప్పారు.