హాస్యాస్పదం – సోమ భరత్, బీఆర్ఎస్ లీగల్ టీమ్
మరోవైపు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, న్యాయవాది సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. “ఈ స్టేజ్లో మేము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాకపోవచ్చని సుప్రీం ధర్మాసనం చెప్పింది. అప్పుడు కేటీఆర్ సూచనల మేరకు.. ఆయన తరఫు న్యాయవాది దవే ‘క్వాష్ పిటిషన్’ను ఉపసంహరించుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు కూడా.. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను విత్డ్రా చేసుకున్న సందర్భం ఉంది. కేటీఆర్ విత్డ్రా చేసుకుంటేనేమో పిటిషన్ కొట్టేసినట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు అలా చేస్తేనేమో.. సుప్రీం వారి పిటిషన్లను కొట్టేయలేదన్నట్టు అర్థసత్యాలు, అబద్ధాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసును ఉప సంహరించుకుంటే ఎదో కేసును కొట్టేసినట్టు కాంగ్రెసోళ్లు, వాళ్ళ బాకాలు అతి చేయడం హాస్యాస్పదం” అంటూ కొట్టిపారేశారు.