నల్గొండ జిల్లా గుర్రంపూడు PHC ని ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ను ఉద్యోగాల నుంచి తొలగించారు. కలెక్టర్ నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతం తీసుకుంటూ సరిగా ఉద్యోగాలు చేయని వారికి ఇదే సరైన నిర్ణయం అంటున్నారు.