‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని ఎంత మంది పాటిస్తారో తెలీదుగానీ హీరోయిన్లు మాత్రం తు.చ. తప్పకుండా పాటిస్తారు. పాతతరం హీరోయిన్లు కాస్త వెసులుబాటు ఇచ్చేవారు. కానీ, ఇప్పటి హీరోయిన్లు మాత్రం అలా లేరు. రెమ్యునరేషన్‌ విషయంలో అసలు తగ్గేదేలే.. అన్నట్టు బిహేవ్‌ చేస్తున్నారు. రెమ్యునరేషన్‌  ఒక్కటే కాదు, వాళ్ళకు ఇచ్చే ఫెసిలిటీస్‌ విషయంలో కూడా నిర్మాతను ముప్పు తిప్పలు పెట్టిన సందర్భాలు సినిమా రంగంలో కోకొల్లలు. కొందరు హీరోయిన్లయితే తాము డిమాండ్‌ చేసిన మొత్తం చెల్లించకపోతే షూటింగ్‌ మధ్యలో వెళ్లిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సినిమాను సకాలంలో పూర్తి చేయడానికి నిర్మాత ఎన్ని ఇబ్బందులు పడ్డా ‘దీపం ఉండగానే..’ సూత్రాన్ని మాత్రం హీరోయిన్లు వదిలిపెట్టడం లేదు అనే విషయం మరోసారి ప్రూవ్‌ అయింది. 

అలాంటి ఓ ఖరీదైన వార్తతో మరోసారి వెలుగులోకి వచ్చింది నయనతార. సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఏ హీరోయిన్‌ తీసుకోనంత రెమ్యునరేషన్‌ తీసుకుంటూ తనకున్న డిమాండ్‌ ఏమిటి అనేది తేటతెల్లం చేస్తోంది. సాధారణం ఒక సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు డిమాండ్‌ చేసే నయన్‌ ఇప్పుడు ఓ యాడ్‌ కోసం 5 కోట్లు వసూలు చేసిందట. ఆ యాడ్‌ నిడివి కేవలం 50 సెకన్లు మాత్రమే. ఓ డీటీహెచ్‌ సంస్థ నయన్‌తో యాడ్‌ చేసేందుకు ఆమెను సంప్రదించారు. దానికామె 5 కోట్లు డిమాండ్‌ చేసిందట. ఆ సంస్థ కూడా ఓకే చెప్పడంతో ఆ యాడ్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ మాత్రమే చేస్తున్న నయన్‌ ఒక హీరో స్థాయిలో పేరు సంపాదించుకుంది. అందుకే ప్రతి సినిమాకీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క కమర్షియల్‌ యాడ్స్‌లో కూడా బిజీగా ఉంటోంది. ఈ విషయంలో ఏ సౌత్‌ హీరోయిన్‌కీ లేని డిమాండ్‌ నయనతారకు ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here