అభిప్రాయ భేదాలు సహజమే
“భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన పార్టీ జనసేన, అసెంబ్లీలో రెండో స్థానంలో ఉన్న పార్టీ మనది, పార్లమెంట్ లో మన సభ్యులు ఉన్నారు, సాక్షాత్తూ ప్రధాని మంత్రి మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాయకత్వం గురించి అనేక సార్లు పొగిడారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ విస్తరించింది, ప్రతీ గ్రామంలో మన జెండా ఎగురుతుంది, ప్రతీ గ్రామంలో జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు, వారందరికీ బలమైన గొంతుగా పవన్ కల్యాణ్ నిలబడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా నాయకులు, కార్యకర్తలకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే, కానీ వాటిని బహిరంగంగా తీసుకెళ్లకండి, ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసేలా పనిచేస్తాం. ఒకే సారి అందరికీ న్యాయం జరగకపోవచ్చు, కానీ కచ్చితంగా గుర్తింపు ఉండేలా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారు”- జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్