Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ బీజాపూర్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం వరకు ఈ కాల్పులు కొనసాగాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) ఐదు బెటాలియన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 229వ బెటాలియన్ సిబ్బందితో కూడిన సంయుక్త బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది.
Home International Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్; 12 మంది నక్సలైట్లు...