సంక్రాంతి కానుకగా విడుదలైన వెంకటేష్‌ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూసిన మహేష్‌బాబు తన స్పందన తెలియజేశారు. కొన్నిరోజుల ముందు ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేసిన మహేష్‌.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇప్పుడు సినిమా చూసి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. పండగ సినిమా ఇదే అనిపిస్తోంది. వెంకటేష్‌గారు చాలా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశారు. నా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఇలా వరసగా విజయాలు అందుకోవడం గర్వంగా ఉంది. ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక బుల్లిరాజు పాత్రలో నటించిన కుర్రాడు అద్భుతంగా చేశాడు. అందర్నీ నవ్వించాడు. ఇంత సక్సెస్‌ఫుల్‌ మూవీని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

మహేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు వంటి ఎంటర్‌టైనర్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మహేష్‌తో చేసే ఏ డైరెక్టర్‌ అయినా సినిమా పూర్తి చేసేందుకు చాలా ఎక్కువ టైమ్‌ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ, సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసి రిలీజ్‌ చేశారు. దాంతో అనిల్‌ అంటే మహేష్‌కి ఎంతో అభిమానం ఏర్పడిపోయింది. అందుకే అతను చేసే సినిమాలను చూసి అప్రిషియేట్‌ చేస్తుంటారు. ఇక వెంకటేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీస్టారర్‌లో కూడా నటించిన మహేష్‌కి వెంకటేష్‌ అంటే ఎంతో గౌరవం. అందుకే వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై తన రివ్యూని జెన్యూన్‌ ఇచ్చారు మహేష్‌. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here