మూడు నెలలుగా జీతాల్లేవ్!

సీఎం చంద్రబాబు ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెచ్చారు. స్టీల్ ప్రైవేటీకరణ, ఆర్థిక ప్యాకేజీపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలు గట్టెక్కినట్లే. గత నాలుగు నెలలుగా తమకు జీతాలు లేవని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల సంఘం సీఎస్ విజయానంద్‌ను కలిశారు. వితంతువులకు పెన్షన్లు కూడా అందడం లేదని, స్టీల్ ప్లాంట్ సమస్యల గురించి, ప్రభుత్వ తక్షణ సాయం గురించి సీఎస్‌కు వినతి పత్రం అందించారు. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణాలకు, పేదల ఇళ్లకు విశాఖ ఉక్కును వినియోగించేలా చూడాలని ఉద్యోగులు సీఎస్ ను కోరారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు రూ.500 కోట్లు చొప్పున నాలుగు నెలలు అడ్వాన్సుగా ఇచ్చేట్లు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ఇటీవల తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఇటీవల దిల్లీ పర్యటనలో పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here