కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. దీంతో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్… ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. రేషన్ కార్డుల ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు. ఆమోదం లభించగా…రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here