8వ వేతన సంఘం ఏం చేస్తుంది?
ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితి, ఆదాయ అసమానతలు, అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో మార్పులను సమీక్షించి సిఫారసు చేయడానికి ప్రభుత్వం వేతన సంఘాన్ని నియమిస్తుంది. బేసిక్ వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అందించే బోనస్లు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను కమిషన్ సమీక్షిస్తుంది. కేంద్ర పే కమిషన్లు (pay commission) ప్రతి దశాబ్దానికి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేళ్లను మదింపు చేయడానికి, సవరణలను సూచించడానికి ఏర్పాటు చేయబడతాయి.