“గ్రామ, వార్డు సచివాలయాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 11162 గ్రామ సచివాలయాలు, 3842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో విలేజ్ సెక్రటేరియట్ లో 11 మంది, వార్డు సెక్రటేరియట్ లో 10 మంది ఉద్యోగులను కేటాయించారు. ఒక ఆలోచన లేని విధంగా ఏర్పాటు చేశారు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూడు కేటగిరీలుగా విభజించారు. 3500 జనాభా పైబడి ఉంటే ఒక కేటగిరీ, 2500-3500 జనాభాకు రెండో కేటగిరీ, 2500 జనాభా కంటే తక్కువ ఉంటే మూడో కేటగిరీ సెక్రటేరియట్స్ గా విభజించారు. 2500 కంటే తక్కువ జనాభా ఉంటే.. సెక్రటేరియట్ లో 6గురిని, 2500-3500 జనాభా ఉంటే 7గురిని, 3500 జనాభా పైబడి ఉంటే 8 మంది ఉద్యోగులను సెక్రటేరియట్ కు కేటాయిస్తారు. అందుకు తగిన విధంగా సర్దుబాటు చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా మూడు విధాలుగా విభజించారు. మల్టీపర్పస్, టెక్నికల్, యాస్పిరేషన్ ఫంక్షనరీస్ కింద ఉద్యోగులను విభజిస్తారు. అధికంగా ఉన్న ఉద్యోగులను ఇతర శాఖల్లో వినియోగించుకుంటారు”- మంత్రి పార్థసారథి
Home Andhra Pradesh పేదలందరికీ ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం-గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు-ap...