ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు చేర్పుల దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లి అనంతరం పుట్టింటి కార్డులో పేరు తొలిగించి, అత్తింటి కార్డుల్లో పేర్లు జోడించాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటి విషయంలో కూడా సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రేషన్ కార్డుల డిజైన్ సైతం మారనుంది. గతంలో ఎలక్ట్రానిక్ రూపంలో కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెలుస్తోంది.