2010లో ‘డాన్‌శీను’తో రచయితగా కెరీర్ ప్రారంభించిన కె.ఎస్.రవీంద్ర అలియాస్ కొల్లి బాబీ.. 2014లో రవితేజ ‘పవర్’తో డైరెక్టర్‌గా మారారు. 2023లో మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ సినిమా చేసిన బాబీ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని నందమూరి బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో డైరెక్టర్‌గా తన సత్తా ప్రూవ్ చేసుకున్నారు. బాలయ్యకు మరో సంక్రాంతి సూపర్‌హిట్‌ని అందించిన బాబీ ‘డాకు మహారాజ్’ను అద్భుతంగా తెరకెక్కించారని నందమూరి ఫ్యాన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. రెగ్యులర్ స్టోరీనే తన డిఫరెంట్ టేకింగ్‌తో విజిల్స్ వేయించారని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం బ్లాక్‌బస్టర్‌తో స్టార్ట్ అయిన బాబీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమిటి అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతనితో సినిమా చేసేందుకు ఇద్దరు హీరోలు లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పవర్’ చిత్రంతో తనను డైరెక్టర్ని చేసిన రవితేజ ఒకరు కాగా, మరొకరు విక్టరీ వెంకటేష్. ఇంతకుముందే వెంకటేష్‌తో ‘వెంకీమామ’ చేసిన బాబీకి ఇది రెండో సినిమా అవుతుంది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషించారు కాబట్టి అతనితో సినిమా చేస్తే అది మూడోది అవుతుంది. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న బాబీ ఎవరితో చేసినా సూపర్‌హిట్ కొడతాడన్న కాన్ఫిడెన్స్ హీరోల్లో ఉంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేస్తారు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో వెంకటేష్ మరో హిట్ కొట్టారు. ‘డాకు మహారాజ్’తో బాబీ కూడా ఫామ్‌లో ఉన్నారు కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లోనే సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం.