అయితే, ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ తాను నిర్దోషినని మరోసారి కోర్టుకు విన్నవించారు. తాను ఆ సమయంలో రుద్రాక్ష మాల ధరించి ఉన్నానని, అలాంటి సమయంలో తాను ఆ దారుణం ఎలా చేస్తానని ప్రశ్నించారు. గతంలో కూడా సంజయ్ రాయ్ తాను నిర్దోషినని పలుమార్లు మీడియా సమక్షంలో కూడా తెలిపారు. ఈ సంచలన కేసులో తీర్పు రానుండడంతో కోర్టు వద్దకు భారీగా మీడియా, ప్రజలు చేరుకున్నారు. విచారణ ప్రారంభమైన 57 రోజుల తర్వాత అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి జస్టిస్ అనిర్బన్ దాస్ తీర్పు వెలువరించారు. నవంబర్ 12న ప్రారంభమైన ఇన్ కెమెరా విచారణ 50 మంది సాక్షులను విచారించింది. ఈ కేసు విచారణ జనవరి 9న ముగిసింది. విచారణలో నిందితుడు నేరం చేశాడని రుజువైనందున, అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోర్టును కోరింది.