మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబును ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి కోరారు. నిన్న మైదుకూరు సభలో శ్రీనివాసరెడ్డి…సీఎం చంద్రబాబు సభావేదికపై ఉండగానే ఈ ప్రతిపాదన చేశారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేశ్ అలుపెరగని సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. కార్యకర్తల సంక్షేమం లోకేశ్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. టీడీపీ ఆవిర్భవించి 42 ఏళ్లు అయిందని, ఇప్పుడు మూడోతరం నడుస్తోందన్నారు. భవిష్యత్తు కోసం, పార్టీని నమ్ముకున్న యువత కోసం లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. దీంతో యువతరానికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనకు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా మద్దతు తెలిపారు.
Home Andhra Pradesh లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా-టీడీపీ నుంచి పెరుగుతోన్న డిమాండ్-ex minister somireddy demands deputy...