డాకు మహారాజ్ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సుల్లో బాలయ్య అదరగొట్టారు. స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు బాబీ కొల్లి. ఈ మూవీలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేసిన డాకు మహారాజ్ చిత్రానికి థమన్ సంగీతం మెప్పించింది. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది.