పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా నకిలీ పోలీసు ప్రత్యక్షం, విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవం సమయంలో విద్యుత్ అంతరాయం, తాజాగా పవన్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ భద్రతపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాలను వేరువేరుగా చూస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం జరగలేదని, కేవలం పర్యటన పూర్తి అయిన తర్వాతే నకిలీ పోలీసు వచ్చినట్లు డీజీపీ పేర్కొ్న్నారు. విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరాను ఎవరు ఎగురవేశారు? అది డ్రోన్ కెమెరానా? అనేది ప్రాథమికంగా నిర్ధారణకు వస్తామని తెలిపారు. అయితే డ్రోన్ ప్రభుత్వానిదేనని పోలీసులు తేల్చారు.
Home Andhra Pradesh పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థదే-deputy cm pawan kalyan...