జనవరి 17 నుంచి దిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 22తో ముగుస్తుంది. మోటారు వాహనాలతో పాటు, ఇతర ఆటోమోటివ్ సంబంధిత ఉత్పత్తులు, ప్రాజెక్ట్‌ల ప్రదర్శనలు కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించాయి. టయోటా కూడా వివిధ రకాల కొత్త వాహనాలు, ఆవిష్కరణలను ప్రదర్శించింది.