హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ షేరు ధర
బుధవారం మధ్యాహ్నం 2:54 గంటల సమయానికి హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ షేరు ధర 1.43 శాతం పెరిగి రూ.1,665.25 వద్ద ట్రేడవుతోంది. జనవరి 22న కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత బ్యాంక్ షేర్లు (share price target) లాభపడ్డాయి. కంపెనీ షేరు 2024 డిసెంబర్ 9న 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,880 వద్ద, 2024 ఫిబ్రవరి 14న 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,363.45 వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (hdfc bank) షేర్లు ఇన్వెస్టర్లకు దాదాపు 15 శాతం రాబడిని, గత ఐదేళ్లలో 33 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి. ఏదేమైనా, స్టాక్ 2025 లో వార్షిక (YTD) ప్రాతిపదికన 7 శాతానికి పైగా పడిపోయింది.