ఉదయాన్నే ఇడ్లీ, దోసెల్లోకి, రాత్రి పూట చపాతీల్లోకి ఎప్పుడూ పల్లీ చట్నీ తినీ తినీ బోర్ కొడుతుందా. కొత్తగా టేస్టీగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేసే నువ్వులతో పచ్చడి తయారు చేసుకుని ఎప్పుడైనా తిన్నారా? కమెడియన్ భారతీ సింగ్ తన YouTube ఛానెల్లో అభిమానులతో తెల్ల నువ్వుల చట్నీని పంచుకున్నారు. ఇది రొట్టె, పరాఠా, దోసె ఇలా ప్రతిదానితోనూ రుచికరంగా ఉంటుంది. ఈ నేపాలీ స్టైల్ నువ్వుల చట్నీని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. తయారు చేసే విధానంలోకి వెళదాం రండి.