సంక్రాంతి కానుకగా ఈ నెల14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki Vasthunnam).విక్టరీ వెంకటేష్(Venkatesh)ఐశ్వర్య రాజేష్(iswarya Rajesh)మీనాక్షిచౌదరి(Meenakshi Chowdhary)హీరో,హీరోయిన్లుగా చెయ్యగా  అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకుడిగా వ్యవహరించాడు.రిలీజ్ రోజు మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.దీంతో తొలి వారమే   200 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త కలెక్షన్ల సునామీకి అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. అన్ని ఏరియాలకి సంబంధించిన థియేటర్స్ లోను పలు రికార్డులు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.

ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లోని మండపేట కి చెందిన ఒక థియేటర్ లో బాహుబలి 2(Baahubali 2)రికార్డులకి చెక్ పెట్టింది. ఫస్ట్ వీక్ లో బాహుబలి 2  53 .25 లక్షలు సాధించగా,సంక్రాంతికి వస్తున్నాం 65.62 లక్షలు సాధించింది.ఇదే థియేటర్ లో బాహుబలి 2  టోటల్ లాంగ్ రన్ లో  90 లక్షలని రాబట్టింది.మరి ఈ లెక్కన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కేవలం పది రోజులలోనే బాహుబలి 2 లాంగ్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేయడం ఖాయమయినట్టే.వీకెండ్ కూడా ఉండటం సంక్రాంతికి వషున్నాం కి ప్లస్ పాయింట్.మరి ఈ లెక్కన లాంగ్ రన్ లో  ఒక్క మండపేట థియేటర్ లోనే సంక్రాంతికి వస్తున్నాం కోటి రూపాయిలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు అంటున్నారు.

ఒక్క మండపేట అనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల ప్రభంజనం కోనసాగుతూనే ఉంది.చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కి పోటెత్తుతున్నారు.అందుకే కలెక్షన్స్ ఎక్కడ ఆగడంలేదు.వెంకీ,అనిల్,దిల్ రాజు(Dil Raju)కెరీర్లోనే వేగంగా 200 కోట్ల మైలు రాయిని అందుకున్న మూవీగా కూడా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం రానున్న రోజుల్లో ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.

 


                                                                           


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here