పక్కా ప్లాన్ ప్రకారం
“ఇవాళ అనుమానాస్పద కారణాలతో నిందితుడు గురుమూర్తిని పీఎస్కు తీసుకొచ్చి విచారించారు. విచారణలో అసలు విషయాలు చెప్పాడు. ఈ నెల 14వ తేదీ ఉదయం డీఆర్డీఎల్, కంచన్ బాగ్లో విధులకు హాజరయ్యేందుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చానని ఒప్పుకున్నాడు. ఫ్రెష్ అయ్యి, తన భార్య మాధవి, వారి ఇద్దరు పిల్లలను బడంగ్ పేటలో తన అక్క సుజాత వాళ్ల ఇంటికి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తీసుకువెళ్లాడు.