వరంగల్‌కు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించి.. అలాంటిదేమి లేదని వదలిపెట్టారు. అయితే తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో తన షాపుకు ఎవరూ రావటం లేదని వాపోయారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారని చెప్పారు.