మొదటి నుంచి కూడా సమంత(Samantha)కేవలం నటిగానే కాకుండా,సమాజంలో జరిగే పలు సమస్యలపై స్పందిస్తు ఉంటుంది.కొన్నిరోజుల క్రితం కేరళ(Kerala)లోని ఒక స్కూల్లో ర్యాగింగ్ అనే పెను భూతం వలన తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన ప్రతి ఒక్కర్నికంటతడి పెట్టించింది.

ఇప్పుడు ఈ విషయంపై సమంత  ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తు ‘మనం 2025 లో ఉన్నా కూడా విషం,ద్వేషం నిండిన కొంత మంది వ్యక్తులు చేసిన ర్యాగింగ్ వల్ల ఒక బాలుడు తన నిండు జీవితాన్ని కోల్పోయాడు.ఎట్టి పరిస్థితులోను ప్రభుత్వం బాలుడి మరణానికి కారణమైన వాళ్ళని వదలకూడదు.మన దగ్గర ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉన్నా కూడా, మళ్ళీ ఎక్కడ ఇబ్బందులు పడతామేమో అని,చాలా మంది కంప్లైంట్ చెయ్యలేక బాధని దిగమింగుకుంటూ ఉన్నారు.అలాంటి వాళ్ళందరూ ఎలాంటి భయం లేకుండా   బయటకొచ్చి తాము ఎదురుకుంటున్న సమస్యలని బహిరంగంగా చెప్పాలి.

మనం కూడా ర్యాగింగ్ వల్ల బలైన వారి పట్ల  చూపించాల్సింది జాలి కాదు, నిందితులని కఠినంగా శిక్షించాలని కూడా మనం కోరాలని  చెప్పుకొచ్చింది.

మరో హీరోయిన్ కీర్తి సురేష్(Kirthi Suresh)కూడా సమంత లాగానే ఈ విషయంపై స్పందిస్తు ‘బాలుడు మృతికి న్యాయం జరగాలి, నిందితులని కఠినంగా శిక్షించాలని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.బాలుడుకి సంబంధించిన వాట్స్ అప్ చాట్ ని ఆమె తల్లి రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా,ఇప్పుడు ఆ చాట్ ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచి వేస్తుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here