‘కొత్తగా మా ప్రయాణం’చిత్రంలో హీరోగా చేసిన ఈశ్వర్(eshwar)ఇప్పుడు ‘సూర్యాపేట్ జంక్షన్'(Suryapet junction)అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.’నైనా సర్వర్’ హీరోయిన్ గా చేస్తున్నఈ మూవీని,యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ,ఎన్ శ్రీనివాసరావు నిర్మించగా,రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు.’గబ్బర్ సింగ్’ ఫేమ్ అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు.
రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతు ‘ఈ సినిమాకి కథ నేనే రాశాను.సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ ఇది.గవర్నమెంట్ నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే సబ్జెక్టు ఇది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఘన విజయాన్ని అందిస్తారని ఎన్నో సార్లు రుజువైంది.అందుకే ఈ సినిమా చేశాం.సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయి.నాలుగు పాటలు కూడా ఉన్నాయి.నేను అనుకున్న కథని డైరెక్టర్ రాజేశ్ గారు చాలా బాగా తెరకేక్కించారు.ప్రేక్షకులు తప్పకుండా మా సినిమాని అదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ నైనా మాట్లాడుతు’ఈ మూవీలో జ్యోతి అనే క్యారక్టర్ లో చేశాను.యూత్ కి బాగా నచ్చే సబ్జెక్టు ఇది.నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు ‘సూర్యాపేట్ జంక్షన్’మూవీని ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపింది.దర్శకుడు నాదెండ్ల రాజేష్ మాట్లాడుతు’మా హీరో ఈశ్వర్ గారు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.కథకి కూడా అయన పూర్తి న్యాయం చేశాడు.కన్నడ,మలయాళ భాషలకి చెందిన చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ‘నైనా సర్వర్'(Naina Sarvar)కి ఇది తెలుగులో మొదటి సినిమా.అయినా కూడా చాలా చక్కగా నటించింది.అభిమన్యు సింగ్ విలన్ రోల్ మా సినిమాకి చాలా కీలకం. చమ్మక్ చంద్ర,భాషా,లక్ష్మణ్ సంజయ్ (బలగం ఫేమ్) హరీష్ ఇలా చాలా మంది మా సినిమాలో చక్కగా చేసారు.రోషన్ సాలూరి, గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చారు. మూడు పాటలు,ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులని ఖచ్చితంగా అలరిస్తాయి.నిర్మాతలు కూడా మా సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపాడు.డి.ఓ.పి: అరుణ్ ప్రసాద్,ఎడిటర్ :ఎం.ఆర్.వర్మ,కో డైరెక్టర్ : శ్రీనివాస్ కోర,లిరిక్స్ :ఎ.రహమాన్,పోస్టర్ డిజైనర్ ధనియేలె,రైటర్స్: సత్య, రాజేంద్ర భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎ పాండు,పీఆర్ఓ: కడలి రాంబాబు,దయ్యాల అశోక్.