శ్రీకాకుళంలో ఉన్న ధరలనే చిత్తూరులో కూడా ఉండాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల అప్పట్లో వ్యాపారులకు ఆదేశించారు. వంటనూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని సివిల్ సప్లైస్ శాఖ ఆదేశించింది. వంట నూనెల సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వర్తకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి రేషన్ కార్డుపై రిఫైండ్ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి రేషన్ కార్డుపై నెలకు సరిపడా వంట నూనెను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకన్నారు.
Home Andhra Pradesh ముణ్ణాళ్ల ముచ్చటగా వంట నూనెల సబ్సిడీ.. మళ్లీ పెరిగిన ధరలు.. తూకంలో తగ్గించి ధరల్లో మాయాజాలం-soaring...