మిసెస్ చిత్రానికి ఆర్తి కడవ్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే.. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కథలో పెద్దగా మార్పులు లేకుండానే రీమేక్ చేసినట్టు అర్థమవుతోంది. కొత్తగా పెళ్లి అత్తింట్లో అడుగుపెట్టిన అమ్మాయి ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ మిసెస్ చిత్రం సాగుతుంది. భర్తతో పాటు అత్తింటి వారి ప్రవర్తన, మాటలు, తీరిక లేని ఇంటి పనులతో ఆ అమ్మాయి ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులతో ఈ చిత్రం ఉండనుంది. ఫ్యామిలీతో ఈ చిత్రాన్ని చూడవచ్చు. చాలా మందికి మిసెస్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలైనా రిలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మూవీని ఫిబ్రవరి 7 నుంచి జీ5లో వీక్షించొచ్చు.
Home Entertainment OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!