సంక్రాంతికి పలు చిత్రాలు థియేటర్స్ తో పాటు ఓటిటి వేదికగా విడుదలై,ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని పంచాయి.ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం కూడా సంక్రాంతికి ఏ మాత్రం తగ్గకుండా,ప్రేక్షకులకి కావలసినంత వినోదాన్ని పంచడానికి, థియేటర్స్ తో పాటు ఓటిటిలోను సందడి చేయనున్నాయి.

ఫిబ్రవరి 7 న యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)జంటగా నటించిన’తండేల్'(Thandel)థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.ప్రచార చిత్రాలతో పాటుట్రైలర్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో అక్కినేని అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక తండేల్ కంటే ఒక రోజు ముందుగానే,అంటే ఫిబ్రవరి 6 న స్టార్ హీరో అజిత్,త్రిష ల కలయిక లో తెరకెక్కిన తమిళ ‘విడామయుర్చి'(vidaamuyarchi)తెలుగులో ‘పట్టుదల’ అనే పేరుతో విడుదల కానుంది.భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు,అజిత్ కి సుదీర్ఘ కాలం నుంచి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉండటం కూడా ‘పట్టుదల’ పై క్రేజ్ నెలకొని ఉంది.ఇక ఫిబ్రవరి 7 నే దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన ‘ఒక పధకం ప్రకారం’ విడుదల కానుంది.వర్సటైల్ నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.పైగా ఇంటర్వెల్ సమయానికి మూవీలో విలన్ ఎవరో కనిపెట్టి చెప్తే 10000 రూపాయలు ఇస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో, ‘ఒక పధకం ప్రకారం’ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.

ఇక ఓటిటి వేదికగా చూసుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 5 న  

‘అనుజా’  అనే  హిందీ లఘు చిత్రం స్ట్రీమింగ్ కానుంది.ఈ చిత్రం ఇటీవలే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ కి ఎంపిక అయ్యింది.

 5 నే ‘సెలబ్రిటీ బేర్ హంట్’ 

‘ప్రిజన్ సెల్ 211 ‘

 6 న ‘ది ఆర్ మర్డర్స్’ ఇలా మూడు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. 

డిస్ని హాట్ స్టార్ లో 4 నుంచి 

‘కోబలి’ అనే తెలుగు వెబ్ సిరీస్ 

సోనీ లైవ్ లో 

ఈ నెల 7 న ‘బడా నామ్ కరెంగే’ అనే హిందీ వెబ్ సిరీస్ 

జీ 5 లో 

 7 న ‘మిసెస్ అనే హిందీ సినిమా’

ఇలా ఈ వారం మూవీ లవర్స్ కి కావాల్సినంత సినీ వినోదం అందనుంది.ఇంకో ప్రముఖ ఓటిటి మాధ్యమం ‘ఈటీవీ విన్’ కూడా ప్రేక్షాదరణ పొందిన పలు ఓల్డ్ మూవీస్ ని అందుబాటులో ఉంచింది. 

 


   


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here