ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం(KIran Abbavaram)తన వరుస పరాజయాలకి స్వస్తి చెప్తు గత ఏడాది చివర్లో ‘క'(Ka)అనే మూవీతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.పునర్జన్మకి సంబంధించిన కోణంలో ఒక విభిన్నమైన పాయింట్ తో తెరకెక్కిన ‘క’ కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పడు‘K-ర్యాంప్'(K ramp)అనే మరో విభిన్నమైన టైటిల్ తో కూడిన మూవీకి సిద్ధమవుతున్నాడు.రంగబలి’ మూవీ ఫేమ్ ‘యుక్తి తరేజా’ హీరోయిన్ గా చేస్తుంది.ఈ రోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభం కాగా,అగ్ర నిర్మాత దిల్ రాజు హీరో హీరోయిన్ల పై క్లాప్ కొట్టాడు.మరో నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ఛాన్ చేశారు.’హాస్య మూవీస్’ పై రాజేష్ దండ(Rajesh Danda)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ బ్యానర్‌లో ఇప్పటికే ‘సామజవరగమన’,‘ఊరుపేరు భైరవకోన’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి.

ఇక మేకర్స్ K-ర్యాంప్’కి సంబంధించిన  టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.లోగోలో ఉన్న బొమ్మ,మందు సీసా,ఫుట్ బాల్‌ సినిమా పట్ల ఇప్పటినుంచే  అందరిలోను ఆసక్తి రేకెత్తిస్తుంది.కేరళ నేపథ్యంలో జరిగే ఈ స్పోర్ట్స్ డ్రామా  K-ర్యాంప్’కి జైన్స్ నాని(jain nani)దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ నరేష్(Naresh)వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here