రాహువు వలన ఈ నష్టాలు కలుగుతాయి
- రాహువు రాక్షస పాముకి అధిపతి. రాహువు ఒక గ్రహం కాదు. గ్రహం యొక్క నీడ. అయినప్పటికీ మన జీవితం పై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది.
- రాహువు గుణాలు అనారోగ్యం, అప్పులు, శత్రుత్వం వంటి వాటికి దారి తీయొచ్చు. రాహువు బలంగా ఉంటే ఆ వ్యక్తి చాలా మతస్థుడు అవుతాడు.
- రాహువు చెడుగా ఉన్నట్లయితే అనేక నైతిక కార్యకలాపాలలోకి నెట్టేస్తుంది. రోగాలు, అప్పులు, వ్యసనాలు వంటివి కూడా కలుగుతాయి.
- జాతకంలో ఏ ఇతర గ్రహంతో రాహువు కలుస్తాడో అది అశుభ ప్రభావాన్ని చూపిస్తుంది. అశుభ యోగాన్ని సృష్టిస్తుంది.
రాహువు అనేక అశుభ యోగాలను సృష్టిస్తాడు
- జాతకంలో సూర్యుడు, రాహువుల కలయిక పితృ దోషాన్ని కలిగిస్తుంది.
- శని, రాహువుల కలయిక శ్రాపిత దోషాన్ని కలిగిస్తుంది.
- చంద్రుడు, రాహువుల కలయిక గ్రహణ దోషాన్ని కలిగిస్తుంది.
- గురు మరియు రాహువుల కలయిక గురు చండాల యోగాన్ని సృష్టిస్తుంది.
- శుక్రుడు, రాహులు పాత్బార్త్ దోషం కలిగిస్తుంది.
రాహువు చెడు ప్రభావం
ఒకవేళ రాహువు చెడు ప్రభావం మీపై ఉన్నట్లయితే ఉదర సంబంధిత సమస్యలు, మైగ్రేన్, చెడు రిలేషన్షిప్, తికమక పడడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో పాటుగా ధన నష్టం, సమన్వయం లోపించడం, సహనాన్ని కోల్పోవడం, పరుష మాటలు, వాహన ప్రమాదం, పరువు నష్టం, వ్యసనం ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి.