ఇన్ కాగ్నిటో మోడ్ అంటే ఏమిటి?
వెబ్ బ్రౌజర్లలో ఇన్ కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ చరిత్ర, కుకీలుచ ఇతర సైట్ డేటాను సేవ్ చేయడాన్ని నిరోధిస్తుంది. మీరు ఇన్ కాగ్నిటో మోడ్ ఉపయోగించినప్పుడు, మీ బ్రౌజింగ్ యాక్టివిటీ బ్రౌజర్ చరిత్రలో లాగిన్ చేయబడదు. ఇన్ పుట్ సమాచారం లేదా సెర్చ్ కోసం ఉపయోగించిన ప్రశ్నలు వంటి డేటా సేవ్ కాదు. అయితే, ఇది మీ ఆన్ లైన్ యాక్టివిటీని వెబ్ సైట్ లు, మీ ISP లేదా నెట్ వర్క్ నిర్వాహకుల నుండి దాచదు.